మంగంపల్లిలో కోటి రూపాయలతో ఆలయ నిర్మాణం.
ఎమ్మెల్యే మేఘారెడ్డి.
పెద్దమందడి,అక్టోబర్12(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో ఆధునిక ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని పాత ఆంజనేయస్వామి, శివాలయాల స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించేందుకు సోమవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆయన సతీమణి శారదారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, హోమ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.గ్రామ ప్రజల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అనుగుణంగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక సంప్రదాయాలు మరింత బలోపేతం కావడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments