చైతన్యపురిలో ఘనంగా ‘ది క్యూ లాంజ్’ స్నూకర్ క్లబ్ ప్రారంభం.
ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు.
కరీంనగర్, అక్టోబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్‌లోని చైతన్యపురి కాలనీలో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది క్యూ లాంజ్’ స్నూకర్ క్లబ్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి క్లబ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు స్వయంగా స్నూకర్ గేమ్ ఆడుతూ కొంతసేపు ఉత్సాహంగా గడిపారు. నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు వినోదం, ఆటలు, రుచికరమైన ఆహార పదార్థాలు, పానీయాలు, ఆహ్లాదకరమైన విశ్రాంతిని అందించేందుకు ఈ లాంజ్ వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, గాజ శివరాం, సోమిడి వేణు, పెద్దపల్లి జితేందర్, నాయకులు కటకం లోకేష్, స్నూకర్ క్లబ్ యాజమాన్యులు, తదితరులు పాల్గొన్నారు.


Comments