మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.

మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.

వనపర్తి,అక్టోబర్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం విషయంలో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాల నాయకులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. బాధితుడు మాసాని సుధీర్‌కు న్యాయం చేయడంతో పాటు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామంలోని ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిధులతో శంకుస్థాపన పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఆలయ దర్శనానికి వెళ్లిన తనను, మాదిగలకు ఆలయ ప్రవేశం లేదంటూ కొందరు అడ్డుకుని దుర్భాషలాడారని మాసాని సుధీర్ ఆరోపించారు. ఈ ఘటనపై గతంలోనూ ఆలయ ప్రవేశం కల్పించాలని వినతిపత్రం ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు.ఆలయ ప్రవేశం విషయంలో వివక్షకు తావులేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలని, కుల వివక్షకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుప్పిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎద్దుల శ్రీనివాస్ రెడ్డిలపై విచారణ జరిపి, ఆరోపణలు నిర్ధారణ అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని, మంగంపల్లి గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. బాధితుడు మాసాని సుధీర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గంధం పరంజ్యోతి, సిరిగిరి మన్నెం, పానుగంటి సురేష్, మంద రాము, పానుగంటి రాము, జె. నాగరాజు, తప్పెట అశోక్, జి. రాహుల్, చిట్యాల తిరుపతి, వడ్డెమాన్ మహేంద్ర, సిరివట్టి శంకర్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్*.
ఎల్కతుర్తి, అక్టోబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో రైతు కర్రె మురళి నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ట్రైనీ ఐఏఎస్...
ఎమ్మెల్యే సొంతూరులోనే ఆలయ ప్రవేశ కుల వివక్ష ఆరోపణలు.
260 మంది పేదల పొట్టకొట్టి.. పెట్రోల్ బంక్ నిర్మిస్తారా?
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి బండి సంజయ్‌కు ఆహ్వానం.
మంగంపల్లి ఆలయ వివక్ష ఆరోపణలపై దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలి.
64వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.