బుద్ధ ధర్మం మానవత్వాన్ని ప్రబోధిస్తుంది.

సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్.

బుద్ధ ధర్మం మానవత్వాన్ని ప్రబోధిస్తుంది.

వనపర్తి,అక్టోబర్14(తెలంగాణ ముచ్చట్లు):

బుద్ధ ధర్మం మానవత్వాన్ని ప్రబోధిస్తూ, సమాజంలో సమానత్వం, ప్రేమ, దయ, అహింసా భావాలను పెంపొందిస్తుందని సాహితీ కళా వేదిక వనపర్ జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన సందర్భంగా 70వ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ బౌద్ధ ధర్మం మనుషులంతా ఒక్కటేనని, కుల, మత, వర్ణ భేదాలకు అతీతంగా అందరూ సమానమేననే సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని జీవుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని, హింసను విడనాడాలని బుద్ధుడు బోధించారని తెలిపారు. ఈ స్ఫూర్తితోనే డా. బి.ఆర్. అంబేడ్కర్ బౌద్ధ ధర్మ మార్గాన్ని స్వీకరించి, తన జీవితాంతం సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని అన్నారు.ఈ సందర్భంగా 26వ సారి రక్తదానం చేసిన డా. బండారు శ్రీనివాస్, నాలుగోసారి రక్తదానం చేసిన నిరంజన్ గౌడ్‌లను శంకర్ గౌడ్ అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంఓ డా. శివప్రసాద్, చందాపూర్ హెచ్‌ఎం బొజ్జిబాబు, ఆస్పత్రి సిబ్బంది లక్ష్మణ్ నాయక్, లక్ష్మి, సంతోష్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.