పండుగల ఏర్పాట్లలో జాప్యం.

పండుగల ఏర్పాట్లలో జాప్యం.

*కమిషనర్ తీరుపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫైర్*

*టెండర్ల పేరుతో కాలయాపన అంటూ ఆగ్రహం*

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లలో జాప్యంపై మున్సిపల్ కమిషనర్ తీరును బీఆర్ఎస్ కౌన్సిలర్లు తప్పుబట్టారు.ఇటీవల అత్యవసర సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో పనులు గుర్తించినా ఇప్పటివరకు ప్రారంభించలేదని ఆరోపించారు. బుధవారం చాగల్లులో పరిశీలన సందర్భంగా "ఐదు నిమిషాల పండుగకు ఫ్లోరింగ్ అవసరమా?" అని కమిషనర్ వ్యాఖ్యానించడంపై కౌన్సిలర్లు మండిపడ్డారు.అనంతరం కమిషనర్‌ను కలిసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని, ఫోన్‌లో ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పారని తెలిపారు.టెండర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని, కమిషనర్‌ను అడిగితే ఏఈని, ఏఈని అడిగితే కమిషనర్‌ను అడగాలని చెబుతున్నారని కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనిల్, బూర్ల రాజేశ్వర్, తాటికొండ మధు ఆరోపించారు. దసరా ప్రాంగణంలో డ్రైనేజీ, ఫ్లోరింగ్ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని, పండుగలకు ముందే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.