మండల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సమీక్ష.

ప్రజా సమస్యల పరిష్కారం, పెండింగ్ పనుల పూర్తి వేగవంతం చేయాలి.

మండల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సమీక్ష.

మానకొండూర్, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు ):

మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు.

గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం తదితర అంశాలపై చర్చించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి సకాలంలో పరిష్కారాలు చూపాలని, ప్రజలకు మెరుగైన సేIMG-20261014-WA0004వలు అందించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.