30 ఏళ్ల అనుబంధానికి మానవత్వపు చేయూత.
పోచయ్య దశదినకర్మలకు ప్రసాద్‌రెడ్డి సోదరుల బియ్యం సాయం.
Views: 131
On
భీమదేవరపల్లి, అక్టోబర్ 15(తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని కొప్పూర్ గ్రామానికి చెందిన మంద పోచయ్య (75) మృతి చెందగా, ఆయన దశదినకర్మల నిర్వహణకు అనుమాండ్ల ప్రసాద్‌రెడ్డి, నాగిరెడ్డి సోదరులు తమ సొంత ఖర్చులతో 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. గ్రామ సర్పంచ్ గద్ద కుమారస్వామి ద్వారా ఈ సాయాన్ని కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. సర్పంచ్ గద్ద కుమారస్వామి సైతం ఆ కుటుంబానికి రూ.2,000 ఆర్థిక సాయం అందించారు.
ప్రసాద్‌రెడ్డి తండ్రి కనుకారెడ్డి వద్ద మంద పోచయ్య 30 ఏళ్ల పాటు పశువుల కాపరిగా పనిచేశారు. పాత అనుబంధాన్ని గుర్తుంచుకొని కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలవడంపై సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు ప్రసాద్‌రెడ్డి, నాగిరెడ్డి సోదరులను అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Oct 2026 21:53:53
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.*
*ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.*
కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
రాజన్న...


Comments