కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

- తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు పుట్టినిల్లు..
- బతుకునిచ్చే బతుకమ్మ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.
- బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న హుజురాబాద్ ఇంచార్జి ప్రణవ్..

హుజురాబాద్,అక్టోబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు పుట్టినిల్లు అని,బతుకమ్మ పండుగ అంటే ప్రతి ఆడబిడ్డ సంతోషంగా గడిపి,పూలను ప్రకృతిగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం రోజున హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలకు ముందస్తుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ కార్యాలయాన్ని సర్వాంగ,సుందరంగా ముస్తాబు చేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఇంటికి దీపం మహిళలే కాబట్టి వారి అభ్యన్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని,రానున్న రోజుల్లో వారి సంక్షేమానికి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని అన్నారు.నియోజవర్గవ్యాప్తంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులతో  కార్యాలయం కిటకిటలాడింది.అనంతరం మహిళలతో కలిసి ఆడి,పాడారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,అన్ని మండలాల,పట్టణ అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు,ప్రజా ప్రతినిధులు,అన్ని అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.