దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

* మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి

* అధికారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచనలు

జమ్మికుంట, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

దసరా, సద్దుల బతుకమ్మ పండుగలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకునేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ వేడుకల్లో మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల హుజురాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. పండుగ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.
అలాగే వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లో దసరా, బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫోన్‌ ద్వారా సూచించారు. అన్ని ప్రాంతాల్లో అధికారులు ముందుగానే ఏర్పాట్లను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
బతుకమ్మ వేడుకలు జరిగే ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు సౌకర్యవంతంగా బతుకమ్మ ఆడుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
పండుగ సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే అధికారులు వెంటనే స్పందించేలా అందుబాటులో ఉండాలని, అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలతో పాటు వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లోనూ దసరా–బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యేపాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. IMG-20261015-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.