రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం!

ఘన్‌పూర్ డివిజన్‌లో 10 గ్రామాల ఎంపిక.. 

ఐదు గ్రామాల్లో సర్వే పూర్తి


స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): 

ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం భూముల పునఃసర్వేకు శ్రీకారం చుట్టింది. పాత భూ రికార్డుల్లో ఉన్న తప్పులు, పట్టా ఉన్నప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, సర్వే నంబర్లలో తేడాలు, భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భూముల పునఃసర్వే ద్వారా భూ రికార్డులను సరిచేసి, భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో మండలానికి రెండు చొప్పున మొత్తం 10 గ్రామాలను పునఃసర్వే కోసం ఎంపిక చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో కొత్తపల్లి, తాటికొండ గ్రామాలను ఎంపిక చేయగా, తాటికొండలో సర్వే పూర్తయింది. చిల్పూర్ మండలంలో రాజవరం, వెంకటాద్రిపేట గ్రామాలను ఎంపిక చేయగా, రాజవరం గ్రామంలో సర్వే పూర్తయింది. జఫర్‌గఢ్ మండలంలో అలియాబాద్, షాపల్లి గ్రామాలను ఎంపిక చేయగా, అలియాబాద్‌లో సర్వే పూర్తయింది. పాలకుర్తి మండలంలో తిరుమలగిరి, లక్ష్మీనారాయణపురం గ్రామాలను ఎంపిక చేయగా, లక్ష్మీనారాయణపురంలో సర్వే పూర్తయింది. కొడకండ్ల మండలంలో రామవరం, నర్సింగాపురం గ్రామాలను ఎంపిక చేయగా, నర్సింగాపురంలో సర్వే ప్రక్రియ పూర్తయింది. దీంతో ఎంపిక చేసిన 10 గ్రామాల్లో ఇప్పటివరకు ఐదు గ్రామాల్లో పునఃసర్వే పూర్తయినట్లు సమాచారం.

పునఃసర్వే ప్రక్రియలో భాగంగా రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే భూములకు సంబంధించిన వివాదాలు తగ్గడంతో పాటు, రికార్డుల్లోని తప్పులు సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని, సర్వే సమయంలో అధికారులకు సహకరించాలని సూచిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.