జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం ఆగదు.

జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం ఆగదు.

హెల్త్ కార్డులు, రక్షణ చట్టం అమలు చేసే వరకు ఉద్యమం

టీఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ

నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.. 

అధ్యక్షుడిగా వంగూరు జయశంకర్

నాగర్ కర్నూల్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత కోసం తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం (టీఎంజేఎఫ్) నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులను అణచివేయాలని చూస్తే, హక్కుల సాధన కోసం పోరాడే శక్తులు మరింత బలంగా ముందుకొస్తాయని హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్‌లో టీఎంజేఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంగిడిచెరువు వెంకటేష్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి బూర్గుల నాగేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి జర్నలిస్టులకు వృత్తిపరమైన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
విధి నిర్వహణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాడులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించేందుకు సమగ్ర జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ చట్టం అమలయ్యే వరకు టీఎంజేఎఫ్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


ప్రతి జర్నలిస్టుకూ ఆరోగ్య భద్రత కల్పించాలి

అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని బూర్గుల నాగేందర్ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

సమావేశంలో టీఎంజేఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వంగూరు జయశంకర్, ఉపాధ్యక్షులుగా సౌటా రాములు, ఎర్రవల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా డి. రామస్వామి, కోశాధికారిగా కావలి పరశురాములు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా గిద్ద విజయ్ కుమార్, సి. సుందర్ ఎన్నికయ్యారు.నూతన కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ అభినందనలు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో టీఎంజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబ్బ నాగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లె రాజన్న, జంగయ్య, భాస్కర్, సుధాకర్‌తో పాటు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.