భక్తులకు అన్నప్రసాద వితరణ.. శ్రీ గణేశ దుర్గ భవాని అసోసియేషన్ సేవలు.

భక్తులకు అన్నప్రసాద వితరణ.. శ్రీ గణేశ దుర్గ భవాని అసోసియేషన్ సేవలు.

-చండీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. 

-ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్సై రాజు ప్రశంసలు

భీమదేవరపల్లి, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

ముల్కనూర్‌లో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు చండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.బుధవారం శ్రీ గణేశ దుర్గ భవాని అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముల్కనూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారి సన్నిధికి చేరుకున్న ఎస్సై రాజుకు వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు ఎస్సై రాజును శాలువాతో సత్కరించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణలు, మండపం డెకరేషన్‌ను ఆయన అభినందించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాదం అందించి సేవాభావాన్ని చాటుకున్న శ్రీ గణేశ దుర్గ భవాని అసోసియేషన్ సభ్యులకు వివేకానంద యూత్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.