ఎల్‌నినో ప్రభావం.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలు!

రైతులకు మామునూరు కేవీకే శాస్త్రవేత్త సౌమ్య కీలక సూచనలు.

ఎల్‌నినో ప్రభావం.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలు!

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు): 

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త సౌమ్య సూచించారు.ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం వల్ల సాగు ఖర్చులను నియంత్రించడంతో పాటు నీటి కొరత కారణంగా పంట నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.

రైతులు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, విత్తే సమయం, నేల స్వభావం, నీటి యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన పెంచుకోవడం ద్వారా రైతులు నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు వ్యవసాయంలో స్థిరమైన దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.