పట్టభద్రుల ఓటే పవన్‌ కళ్యాణ్‌ ఆశయ సాధనకు ఆయుధం.

పట్టభద్రుల ఓటే పవన్‌ కళ్యాణ్‌ ఆశయ సాధనకు ఆయుధం.

జనసేన అభ్యర్థి గడల శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేయాలి

-జనసేన నాయకులు గాదె పృథ్వీ

చిల్పూర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): 

పట్టభద్రులంతా బాధ్యతగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు గాదె పృథ్వీ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల నాయకుడు కనకం రంజిత్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తలు మండపాక కావ్య, బెక్కం జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి గడల శ్రీనివాసరావును గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గ్రామస్థాయిలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను జనసైనికులు తీసుకోవాలని సూచించారు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలను నెరవేర్చే దిశగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు, అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
సమావేశం అనంతరం మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమంచ సునీల్, కొలిపాక వంశీకృష్ణ, వస్కుల అనిల్, కరుణాకర్, రాకేష్ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.