విద్యానగర్‌లో ఘనంగా చండీ హోమం.

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వి. నవీన్ చంద్ ఐపీఎస్.

విద్యానగర్‌లో ఘనంగా చండీ హోమం.

హుజురాబాద్,అక్టోబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

పట్టణంలోని విద్యానగర్‌లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చండీ హోమం వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ శ్రీ వి. నవీన్ చంద్ ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో హుజురాబాద్ పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతను చాటుతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. పండుగలను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైష్ణవి మురళి మంచికట్ల, దామెర అనుషా–అనురాగ్, గురుస్వామి నటరాజ్ బుర్ర, ఎల్.వి. అర్జున్‌తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చండీ హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో విద్యానగర్‌లో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.