ఆయిల్ఫామ్ సాగులో అధిక దిగుబడులపై రైతులకు అవగాహన.
ముల్కనూర్ సహకార సంఘంలో ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు సదస్సు.
భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఆయిల్ఫామ్ సాగులో సరైన పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ రీజినల్ మేనేజర్ రాజారెడ్డి తెలిపారు. గురువారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ఫామ్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ఫామ్ పంటకు ప్రతి మూడు నెలలకోసారి ప్రాథమిక పోషకాలతో పాటు ద్వితీయ, సూక్ష్మ పోషకాలను అందించడం ద్వారా పంట ఎదుగుదల మెరుగుపడి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. పంటలో బోరాన్, మెగ్నీషియం, పొటాషియం పోషకాల లోపాలను గుర్తించి నివారించేందుకు ఏరిస్ కంపెనీకి చెందిన మ్యాగ్ మిక్స్, న్యూక్యాలిభోర్, ఏరిఫొటాష్ ఉత్పత్తులను సూచించిన మోతాదుల్లో వినియోగించుకోవాలని తెలిపారు.
అలాగే ఆయిల్ఫామ్ సాగులో నీటి యాజమాన్యం, పోషకాల సమతుల్య వినియోగం, కీటకాలు, తెగుళ్ల నివా
రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తూ, పంట అవసరాలకు అనుగుణంగా పోషకాలను అందించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జనరల్ మేనేజర్ మారుపాటి రాంరెడ్డి, ఏరిస్ కంపెనీ సిబ్బంది శ్రీనివాస్, వినయ్, పున్నం, మునేందర్, రమేష్, వెంకన్నతో పాటు సంఘ వ్యవసాయ అధికారులు ఎస్. శ్రీనివాస్, బి. స్వామిరావు, ఎం. అచ్యుతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments