విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి.

మల్కాపూర్‌లో విషాదం.. కుటుంబంలో తీరని శోకం.

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి.

చిల్పూర్,అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని మల్కాపూర్ గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.
పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా పలివెల్పుల గ్రామానికి చెందిన కందికొండ వెంకటేశ్వర్లు (45) రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మల్కాపూర్ గ్రామానికి చెందిన దొడ్ల బుచ్చిరెడ్డి ఇంటి వద్ద భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనను గమనించిన తోటి కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.