శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
Views: 1
On
హుజూరాబాద్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
హుజూరాబాద్ మండలం శాలపల్లి గ్రామంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Oct 2026 21:53:53
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.*
*ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.*
కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
రాజన్న...


Comments