పట్టభద్రుల ఓటర్లకు అలర్ట్‌.. మళ్లీ కొత్తగా నమోదు తప్పనిసరి!

పట్టభద్రుల ఓటర్లకు అలర్ట్‌.. మళ్లీ కొత్తగా నమోదు తప్పనిసరి!

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు డి-నోవో ఓటర్ల జాబితా తయారీ.. 

నవంబర్ 6 చివరి గడువు

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): 

రాష్ట్రంలో 2027 మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించే ప్రక్రియ చేపట్టారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి 2026 నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా పరిగణిస్తూ డి-నోవో విధానంలో ఓటర్ల జాబితాను తయారు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 2023 అక్టోబర్ 31వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని అధికారులు తెలిపారు.

అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ముసాయిదాను నవంబర్ 25న, తుది జాబితాను డిసెంబర్ 30న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పట్టభద్రుల ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం తప్పనిసరిగా కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. పాత జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన కొత్త జాబితాలో పేరు నమోదైనట్లు భావించరాదని సూచించారు.
దరఖాస్తుతో పాటు డిగ్రీ ధ్రువపత్రం ప్రతిని జతచేయాలి. అర్హులైన పట్టభద్రులు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్ http://ceotelangana.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు సంబంధిత ఓటరు నమోదు అధికారి, సహాయ ఓటరు నమోదు అధికారి కార్యాలయాల్లోనూ దరఖాస్తులు సమర్పించవచ్చని స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఓటరు నమోదు అధికారి ఎస్. కిరణ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోగా అర్హులైన పట్టభద్రులంతా దరఖాస్తు చేసుకుని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

 

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.