లక్ష మంది తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలి.

లక్ష మంది తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలి.

ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు అందించాలి.

-డాక్టర్ పిడమర్తి రవి

గన్‌పార్క్,అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ గుర్తించి, వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు గుర్తింపు కార్డులు అందించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ఆన్‌లైన్‌లో ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. బీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పిడమర్తి రవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. నాలుగు విభాగాల్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, ఒక్కో విభాగంలో 25 వేల మందికి చొప్పున మొత్తం లక్ష మంది ఉద్యమకారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గుర్తింపు పొందిన లక్ష మంది తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల త్యాగాలను గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు భావించారని విమర్శించిన పిడమర్తి రవి, రాష్ట్ర సాధనలో పేదలు, సామాన్యులు, అట్టడుగు వర్గాల ప్రజల పాత్ర కీలకమని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ అందే కృష్ణ, డాక్టర్ దుడపాక సురేష్, డాక్టర్ నరసింహ, ఎండీ రహీం, నక్క మహేష్, జోగు గణేష్, మీసాల మహేష్, పాల్వాయి విజయ్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.