ఎండిన బోర్ల పునరుద్ధరణకు బోర్ రీఛార్జ్ పనులు ప్రారంభం.
వేలేరు, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలో విబీజీ రాంజీ పథకంలో భాగంగా బోర్ రీఛార్జ్ పనులను వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, ఎంపీడీవో కిషన్ నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఎండిపోయిన బోర్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు బోర్ రీఛార్జ్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విబీజీ రాంజీ పథకంలో భాగంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎండిన బోర్ల వద్ద రీఛార్జ్ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ బిల్లా యాదగిరి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, రాజు, అరుణ నాగరాజు, వేలేరు ఉపసర్పంచ్ శ్రీకర్, విబీజీ రాంజీ టీఏ ప్రదీప్, సతీష్, వార్డు సభ్యుడు రణధీర్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ చంద్రమౌళి, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments