నగర పారిశుధ్యానికి కొత్త యంత్రాలు.

నగర పారిశుధ్యానికి కొత్త యంత్రాలు.

*రూ.కోటి నిధులతో జేసీబీ, లాడర్ యంత్రాల కొనుగోలు.*

*ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్,డిప్యూటీ మేయర్ .

కరీంనగర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

నగర విస్తరణకు అనుగుణంగా పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తూ, అభివృద్ధి పనుల ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నగరపాలక సంస్థకు చెందిన రూ.కోటి నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీ, లాడర్ యంత్రాలను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పాలకవర్గ సభ్యులతో కలిసి మేయర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్వయంగా యంత్రాలను నడిపి వాటి పనితీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణతో పాటు అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ తమ పాలకవర్గం ముందుకు సాగుతోందని తెలిపారు. పెరుగుతున్న నగర విస్తరణకు అనుగుణంగా పారిశుధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ, ఇతర పరిపాలనా కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు నూతన యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఆధునిక యంత్రాల వినియోగం కీలకమని మేయర్ స్పష్టం చేశారు. నూతన యంత్రాల అందుబాటుతో నగరంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడటంతో పాటు అభివృద్ధి పనులకు వేగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.