మున్సిపల్ కార్మికులకు దుస్తుల పంపిణీ.

డాక్టర్ దారం నాగభూషణం 9వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం.

మున్సిపల్ కార్మికులకు దుస్తుల పంపిణీ.

*సర్ధార్ రవీందర్ సింగ్ గారి చేతుల మీదుగా కార్మికులకు దుస్తుల అందజేత*


కరీంనగర్, అక్టోబర్ 14(తెలంగాణ ముచ్చట్లు ):

 దివంగత ప్రముఖులు డాక్టర్ దారం నాగభూషణం గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని 58వ డివిజన్‌లో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. డాక్టర్ దారం నాగభూషణం గారి తనయుడు డాక్టర్ రఘురామన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ కార్పొరేటర్ సోహన్ సింగ్ పాల్గొన్నారు.

మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులకు దుస్తులను అందజేశారు. నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, సమాజ ఆరోగ్య పరిరక్షణలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

దివంగత డాక్టర్ దారం నాగభూషణం గారి వర్ధంతిని సేవా కార్యక్రమం ద్వారా నిర్వహించడం ఆయన సేవలను స్మరించుకోవడంతో పాటు, కార్మికులకు తోడ్పాటు అందించే మంచి ప్రయత్నమని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.