చెరువులను కాపాడండి.. జలవనరులను పరిరక్షించండి.

చెరువులను కాపాడండి.. జలవనరులను పరిరక్షించండి.

- ఆక్రమణలు, వ్యర్థాలతో మురుగుకూపాలుగా మారుతున్న చెరువులు.
- నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే చర్యలు చేపట్టాలి.. బీజేపీ డిమాండ్‌.

అశ్వారావుపేట, అక్టోబరు 14(తెలంగాణ ముచ్చట్లు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని చెరువుల పరిరక్షణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ నియోజకవర్గ నాయకుడు తంబళ్ల రవి డిమాండ్‌ చేశారు. ఒకప్పుడు తాగు, సాగునీటికి ప్రధాన ఆధారాలుగా ఉన్న చెరువులు నేడు ఆక్రమణలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం, గుర్రపుడెక్కతో నిండిపోయి మురుగుకూపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల దుస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడాలని ఆయన సూచించారు. చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జలవనరుల పరిరక్షణకు ఇప్పటికైనా సమగ్ర చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో నీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. చెరువులు కేవలం నీటి నిల్వ కేంద్రాలే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, పశుపక్ష్యాదుల మనుగడకు కీలకమని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే జలవనరులను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణలను అరికట్టి, వాటి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొట్టి పుల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ నాయకుడు తంబళ్ల రవి, దమ్మపేట మండల బీజేపీ అధ్యక్షుడు పల్లపు వెంకటేశ్వర్లు, దార నాగేశ్వరరావు, ఉడతనేని విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20261014-WA0016

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.