సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం.
నియోజగవర్గ అధ్యక్షులు తిరగమళ్ళ నాగార్జున.
హుజురాబాద్,అక్టోబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ (ఎస్హెచ్సీఎస్సీ) హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా తిరుగమళ్ల నాగార్జున బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంపొందించడం, ప్రజలకు చట్టబద్ధంగా అందాల్సిన సమాచారాన్ని పొందేలా మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా ఆయన పనిచేయనున్నారు.
సమాచార హక్కు చట్టం ప్రజలకు కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పించి, తమ సమస్యలకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని చట్టబద్ధంగా పొందే విధానాలపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమాచార హక్కు చట్టం వినియోగంపై అవగాహన పెంచేందుకు కృషి చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. కమిటీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, ప్రజాసమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాల్లో సహకరించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు తమ హక్కులపై అవగాహన పెరగడంతో పాటు, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు. నాగార్జున నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు చేపట్టడం పట్ల కమిటీ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


Comments