మీదికొండ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

మీదికొండ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

*కారు ఢీకొని ఆటో బోల్తా..*

*మహిళ దుర్మరణం, మరో 7 గురికి గాయాలు*

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

  మండలంలోని మీదికొండ క్రాస్ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.వ్యవసాయ పనులు ముగించుకుని స్టేషన్ ఘన్‌పూర్ పట్టణానికి చెందిన కామల్ల ఐలమ్మ(55), నీరటి మౌనిక, పిట్టల రేణుక తదితరులు ఏపీ 03 టీ 0105 ఆటోలో తిరిగి వస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన టీఎస్ 27 టీ 7986 కారు బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐలమ్మను హనుమకొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.