చిల్పూర్‌లో కడియం మార్క్..

చిల్పూర్‌లో కడియం మార్క్..

ఐటీఐ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం!

వెంకటేశ్వరపల్లిలో స్థల చదును పనులు ప్రారంభం

చిల్పూర్,అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషితో కళాశాల మంజూరు కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
కళాశాల నిర్మాణానికి కేటాయించిన స్థలంలో చదును చేసే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టారు. త్వరలోనే కళాశాల నిర్మాణ పనులు ముందుకు సాగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీఐ కళాశాల అందుబాటులోకి వస్తే మండలంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు సాంకేతిక విద్య, వృత్తి నైపుణ్యాలు అభ్యసించే అవకాశం లభించనుంది. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరపల్లి సర్పంచ్ శివరాత్రి రేణుక వీరస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమీది సురేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారుIMG-20261014-WA0029

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన. జర్నలిస్టులకు అండగా తెలంగాణ రక్షణ సేన.
*బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి.* *ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలి — గుంజపడుగు హరిప్రసాద్.* కరీంనగర్, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): రాజన్న...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
శాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.
హక్కుల పరిరక్షణకు రాజ్యాంగ చైతన్యమే ఆయుధం.
పేదల భూముల జోలికొస్తే పోరాటం తప్పదు.
దసరా–బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. 17 ప్రాంతాల్లో ఏర్పాట్లు.