బుద్దారం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించాలి.

స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్‌ ముదిరాజ్‌ డిమాండ్‌.

బుద్దారం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించాలి.

వనపర్తి,అక్టోబర్17(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా బుద్దారం పెద్ద చెరువు రిజర్వాయర్‌ రెండో దశలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయబద్ధమైన నష్టపరిహారం అందించాలని వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల రైతులు భూములతో పాటు బోర్లు, పైపులైన్లు, పండ్ల తోటలు, బావులు, విద్యుత్‌ పరికరాలను కోల్పోతున్నారని, వారి నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి తగిన పరిహారం చెల్లించాలని కోరారు.వనపర్తి పట్టణానికి బుద్దారం నుంచి కాలినడకన వస్తున్న భూ నిర్వాసిత రైతులను దయానంద్‌ ముదిరాజ్‌ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్దారం పెద్ద చెరువు రిజర్వాయర్‌ రెండో దశలో సుమారు 135 మంది రైతులకు చెందిన 101 ఎకరాల 33 గుంటల భూములు ముంపునకు గురవుతున్నట్లు తెలిపారు. బాధిత రైతులకు ప్రభుత్వం రూ.15 లక్షల పరిహారం ప్రకటించినట్లు తెలుస్తోందని, అయితే భూములతో పాటు వాటిపై ఉన్న వ్యవసాయ వనరులు, ఆస్తులను కోల్పోతున్న రైతులకు ఈ పరిహారం సరిపోతుందో లేదో పరిశీలించి న్యాయం చేయాలని అన్నారు.భూములు కోల్పోతున్న కుటుంబాల్లో 18 సంవత్సరాలు పైబడిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, భూమిపై ఆధారపడి వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న వారికి వెయ్యి రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. భూములు కోల్పోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.రిజర్వాయర్‌ నిర్మాణంతో జీవనాధారాన్ని కోల్పోతున్న రైతులు, వారి కుటుంబాల సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని దయానంద్‌ ముదిరాజ్‌ కోరారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు. వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు.
వేలేరు, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో నీటి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ భూమి వద్ద నీటి విషయమై...
మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి అభినందనలు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.
బుద్దారం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించాలి.
రీ- సర్వేను అడ్డుకున్న విరాయపల్లి రైతులు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమగ్ర సన్నద్ధత.
రైతాంగ సమస్యలపై బీజేపీ సమరశంఖం.