ఎమ్మెల్సీ ఓటరు నమోదును 100% పూర్తి చేయాలి.
*సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి*
*- నియోజకవర్గ కోఆర్డినేటర్లు పిలుపు*
*స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):*
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్పూర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సమీక్ష సమావేశం జరిగింది.నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ రవళి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు హాజరై నాయకులకు, యూత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు.పట్టభద్రులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని, ఈ నెల 23, 24 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. మండలానికి ఒక కోఆర్డినేటర్, ఇద్దరు అసిస్టెంట్ కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ స్టేషన్ ఘన్పూర్ నుంచి అందించి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి, మండల పార్టీ అధ్యక్షులు, యూత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.


Comments