బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చిల్పూర్కు ఏం చేశారు?
మాజీ ఎంపీటీసీ ఏన్నకూస కుమార్.
చిల్పూర్, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు) :
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చిల్పూర్ మండల అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఏన్నకూస కుమార్ ఆరోపించారు.
శుక్రవారం వెంకటాద్రిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ...మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం మండలంలో ఒక్క పల్లగుట్ట గ్రామంలోనే ఇళ్లు ఇచ్చారని, అవి కూడా అర్హులకు దక్కక శిథిలావస్థకు చేరాయని విమర్శించారు.దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు ఎంతమందికి ఇచ్చారో, ఎంత వసూలు చేశారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు, మహిళా సంఘ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. చిల్పూర్లో ఐటీఐ ఏర్పాటుకు, మండల కార్యాలయ భవనాలకు భూములు కేటాయించారని, ప్రతి గ్రామానికి రెండు విడతల్లో 40 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు.మాటలతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


Comments