వేలేరు పోలీస్ స్టేషన్లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు.
Views: 0
On
వేలేరు, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో నీటి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ భూమి వద్ద నీటి విషయమై ఇద్దరు రైతుల మధ్య తలెత్తిన గొడవ చివరకు కర్రలతో పరస్పర దాడులకు దారితీసింది. ఈ ఘటనలో ఆకుల శ్రీనివాస్, బొజ్జ అశోక్ ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు కర్రలతో దాడి చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఇరువురు రైతులు వేలేరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు.
వ్యవసాయ భూమి వద్ద నీటి విషయంలో ప్రారంభమైన వివాదం పరస్పర దాడులకు, ఆపై పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
17 Oct 2026 20:33:37
వేలేరు, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో నీటి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ భూమి వద్ద నీటి విషయమై...


Comments