పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమగ్ర సన్నద్ధత.

ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమగ్ర సన్నద్ధత.

మహబూబ్ నగర్,అక్టోబర్17(తెలంగాణ ముచ్చట్లు):

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ పార్టీ సమగ్ర సన్నాహక సమావేశాన్ని శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం, ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, మహబూబ్‌నగర్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సరిత, మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు డీసీసీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు. వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు.
వేలేరు, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో నీటి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ భూమి వద్ద నీటి విషయమై...
మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి అభినందనలు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.
బుద్దారం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించాలి.
రీ- సర్వేను అడ్డుకున్న విరాయపల్లి రైతులు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమగ్ర సన్నద్ధత.
రైతాంగ సమస్యలపై బీజేపీ సమరశంఖం.