మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి అభినందనలు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలి.
మానకొండూర్, అక్టోబర్ 17(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ ప్రజాభవన్ కార్యాలయంలో మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్గా నియమితులైన రాజలింగం, వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రెమిడీ శ్రీనివాస్ రెడ్డితో పాటు పాలకవర్గ డైరెక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
నూతన పాలకవర్గం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు పంటల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రైతులకు పంటలకు న్యాయమైన ధరలు లభించేలా మార్కెట్ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
నూతన పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని చూరగొని, మానకొండూర్ ప్రాంత వ్యవసాయ రంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments