ఘనపూర్‌లో దసరా సందడి.. భారీ రావణ దహనానికి ఏర్పాట్లు ముమ్మరం!

ఘనపూర్‌లో దసరా సందడి.. భారీ రావణ దహనానికి ఏర్పాట్లు ముమ్మరం!

అక్టోబర్ 20న 14వ వార్డులో వేడుకలు 

 జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ఆహ్వానం 

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): 

దసరా పండుగను పురస్కరించుకుని స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో భారీ రావణ దహన వేడుకలకు రంగం సిద్ధమైంది. పట్టణంలోని 14వ వార్డులో కౌన్సిలర్ కృష్ణవేణి–సారయ్య ఆధ్వర్యంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 20న ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
14వ వార్డులోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో పాటు భారీ రావణ దహనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పండుగను ప్రజలందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్ పెసర సారయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. దసరా వేడుకల్లో పట్టణ ప్రజలు, యువత, కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో గట్టు రమేష్, తోకల రాజు, పొన్నం రాజయ్య, పొన్న రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు. వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు.
వేలేరు, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో నీటి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ భూమి వద్ద నీటి విషయమై...
మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి అభినందనలు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.
బుద్దారం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించాలి.
రీ- సర్వేను అడ్డుకున్న విరాయపల్లి రైతులు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమగ్ర సన్నద్ధత.
రైతాంగ సమస్యలపై బీజేపీ సమరశంఖం.