గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.

కొత్తకోట ఎస్సై విక్రమ్.

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.

కొత్తకోట,అక్టోబర్17(తెలంగాణ ముచ్చట్లు):

క్రీడలలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమిని ఒక గుణపాఠంగా భావించినప్పుడే నిజమైన విజయం సాధ్యమవుతుందని కొత్తకోట ఎస్సై విక్రమ్ అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదల పెంపొందిస్తాయని పేర్కొన్నారు.వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం ఎస్సై విక్రమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బొంతం శిరీష సాయి, పంచాయతీ కార్యదర్శి రాజు హాజరయ్యారు. ముందుగా నిర్వాహకులు ఎస్సైకి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం తొలి మ్యాచ్‌లో పాల్గొనే జట్లకు ఎస్సై టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. కాసేపు ఆయన స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవర్చుతాయని తెలిపారు. టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూత్ నిర్వాహకులను అభినందించారు.ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయని, మొదటి రోజు రెండు జట్లు తలపడ్డాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపులో ఎస్సై విక్రమ్‌కు మెమెంటో అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివనారాయణ, నాయకులు గోపాల్ రెడ్డి, మురళి రెడ్డి, కొత్త రాములు, బొజ్జన్న, దారమోని బాలరాజు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు హోటల్ రాజు, గోవర్ధన్, సాయిరాం, నక్కల శాంతన్న, కొత్త నర్సింహా, నరేందర్, విజయ్, టోర్నమెంట్ నిర్వాహకులు సంతోష్, ధనుష్, గణేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు. వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు.
వేలేరు, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో నీటి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వ్యవసాయ భూమి వద్ద నీటి విషయమై...
మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి అభినందనలు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.
బుద్దారం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించాలి.
రీ- సర్వేను అడ్డుకున్న విరాయపల్లి రైతులు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమగ్ర సన్నద్ధత.
రైతాంగ సమస్యలపై బీజేపీ సమరశంఖం.