దుర్గామాతను దర్శించుకున్న ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షుడు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.

దుర్గామాతను దర్శించుకున్న ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షుడు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.

ఖిల్లా ఘనపూర్,అక్టోబర్19(తెలంగాణ ముచ్చట్లు):

శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం మనజీపేట గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాత అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షుడు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి ఆహ్వానం మేరకు మనజీపేట గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల గురించి నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలత రాఘవేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రయ్య, వనపర్తి జిల్లా మాజీ సోషల్ మీడియా కన్వీనర్ ఎం. దేవన్న యాదవ్, వెంకటేష్, మలేష్, బుచ్చన్న, పొనుగంటి శీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం.
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...
క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.
18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య.