పారిశుద్ధ్య కార్మికుల శ్రమకు గుర్తింపు..
Views: 2
On
*పండుగ వేళ... కానుకగా కొత్త సర్పంచ్*
*ఫతేపూర్ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ ఊమ్లా నాయక్ ఔదార్యం*
చిల్పూర్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
దసరా పండుగను పురస్కరించుకుని ఫతేపూర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ గుగులోతు లక్ష్మీ ఊమ్లా నాయక్ నూతన దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ ఊమ్లా నాయక్ మాట్లాడుతూ.. "గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది పడుతున్న శ్రమ వెలకట్టలేనిది. వారి శ్రమను గుర్తించి, పండుగ సంతోషాన్ని వారితో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. గ్రామాభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకం" అని పేర్కొన్నారు.పండుగ వేళ సర్పంచ్ తమను గుర్తించి దుస్తులు ఇవ్వడం పట్ల సిబ్బంది, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Oct 2026 20:35:22
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...


Comments