స్టేషన్ ఘనపూర్ లో రావణ దహన ఏర్పాట్లను.
పరిశీలించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్.
*దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు*
*ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు*
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 14వ వార్డులో దసరా రోజు జరగనున్న భారీ రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లను డీసీపీ శ్రీ రాజమహేంద్ర నాయక్, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్ పరిశీలించారు.క్రీడా ప్రాంగణంలో జరగనున్న ఉత్సవ ఏర్పాట్లను వారు సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ సందర్భంగా 14వ వార్డు కౌన్సిలర్ ప్రెషర్ కృష్ణవేణి - సారయ్య మాట్లాడుతూ.. రేపు జరగబోయే రావణ వధ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నీల గట్టయ్య,కిషోర్ చారి, గజ్జల రాజు, గడ్డాల శేఖర్, రాజారపు ఏలియా, అక్క పెళ్లి శీను, పొన్నాల స్వామి, మామిడాల శ్రీనివాస్, కొండ రవి తదితరులు పాల్గొన్నారు.


Comments