మల్కాపూర్‌లో దసరా సందడి.

మల్కాపూర్‌లో దసరా సందడి.

పండుగ వేళ క్రికెట్ టోర్నమెంట్‌తో యువతలో ఉత్సాహం

విజేతలకు బహుమతులు అందజేసిన కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి మల్లారెడ్డి

చిల్పూర్, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): 

దసరా, సద్దుల బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ యువతలో ఉత్సాహాన్ని నింపింది. పండుగ వేళ క్రీడా పోటీలతో గ్రామంలో సందడి నెలకొంది. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు, ఐక్యత, స్నేహభావాన్ని చాటిచెప్పే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు.
హోరాహోరీగా సాగిన క్రికెట్ పోటీల అనంతరం విజేత జట్లకు మొదటి, రెండో బహుమతులను కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి మల్లారెడ్డి తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ.. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో ప్రతిభ వెలుగులోకి రావడంతోపాటు, పరస్పర స్నేహభావం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే లక్షణాలు పెంపొందుతాయని గ్రామస్తులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని యువత ఆకాంక్షించారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఎడవెల్లి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ పసుల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యుడు మాటూరి రాకేశ్, కాంగ్రెస్ నాయకులు సాంబారి రాజేశ్వర్, రాంరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం.
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...
క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.
18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య.