ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు.

గోదావరి జలాలున్నా పంటలకు అందించడంలో ప్రభుత్వం విఫలం – మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

చొప్పదండి, అక్టోబర్ 19(తెలంగాణ ముచ్చట్లు ):

ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లెదుటే గోదావరి నీళ్లు ఉన్నా పంటలకు అందించకుండా రైతుల కళ్లలో కన్నీళ్లు చూస్తోందని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని ఎద్దేవా చేశారు.

కరువు ముప్పు ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ, ముందస్తు చర్యలు తీసుకుని పంపులను ఆన్ చేసి నీటిని వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు.

జూన్ 1 నుంచి అక్టోబర్ మధ్య కాలంలో గోదావరి, కృష్ణా నదుల ద్వారా దాదాపు 1,000 టీఎంసీలకు పైగా వరద నీరు సముద్రంలోకి వృథాగా వెళ్లిపోయినా, ప్రభుత్వం ఆ నీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్ కూడా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు కరెంటు సరఫరా నిలిపివేయలేదని, రైతుబంధు పథకాన్ని ఆపలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలన రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లు ఆన్ చేస్తే నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఉన్నప్పటికీ, కేసీఆర్‌ను రాజకీయంగా బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే మేడిగడ్డ మరమ్మతులు చేపట్టలేదని ఆయన ఆరోపించారు.

ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని సుంకె రవిశంకర్ వ్యాఖ్యానించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం.
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...
క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.
18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య.