సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.

తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించా.

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.

కరీంనగర్, అక్టోబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మహిళలతో బతుకమ్మను ఎత్తుకొని వేడుకల్లో సందడి చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణతో పాటు దేశ, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరువు నుంచి విముక్తి కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

రైతాంగం సంతోషంగా ఉండాలని, పాడిపంటలతో తెలంగాణ సుభిక్షంగా విలసిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం, కరీంనగర్‌ జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
కరీంనగర్, అక్టోబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ): కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో...
వేలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురిపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు.
మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి అభినందనలు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి.
బుద్దారం రిజర్వాయర్‌ భూ నిర్వాసితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించాలి.
రీ- సర్వేను అడ్డుకున్న విరాయపల్లి రైతులు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమగ్ర సన్నద్ధత.