క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.

వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్.

క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.

పెద్దమందడి,అక్టోబర్19(తెలంగాణ ముచ్చట్లు):

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్న తుడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ తుడి శ్రీనివాస్ రెడ్డి కృషి అభినందనీయమని వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్ అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన వెల్టూర్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ట్రోఫీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన తుడి శ్రీనివాస్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాలుగు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఎంతో క్రీడా ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, అవసరమైన క్రీడా సామగ్రి అందిస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీనివాస్ రెడ్డి క్రికెట్ కిట్లు అందజేయడం యువతకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదల వంటి లక్షణాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు మరింత మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా అశోక్ ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం.
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...
క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.
18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య.