ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.

ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.

*ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఐక్యకూటమి ఘనవిజయం*

*మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సన్మానించిన యూనియన్‌ నాయకులు*

కరీంనగర్, అక్టోబర్ 19(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్‌ ఆర్టీసీ వర్క్‌షాప్‌ జోనల్‌ పరిధిలో నిర్వహించిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఐక్యకూటమి ఘనవిజయం సాధించింది. సుమారు 12 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఐక్యకూటమి భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేసింది.

ఈ సందర్భంగా ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో యూనియన్‌ నాయకులు ఈ రోజు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని మంత్రికి పూల మొక్క అందజేసి ఘనంగా సన్మానించారు.

అనంతరం ఆర్టీసీ వర్క్‌షాప్‌లోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్‌ నాయకులు మంత్రికి వివరించి, వాటిని పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు సురేష్‌ గౌడ్‌, ఆంజనేయులు, కాజా, ప్రవీణ్‌ కుమార్‌, సాయికుమార్‌, లవ్‌ కుమార్‌, వెంకట్‌ రెడ్డి, సందీప్‌, వెంకటస్వామితో పాటు వర్క్‌షాప్‌ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం. జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమం.
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...
క్రీడాకారులను తుడి శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించడం అభినందనీయం.
గ్రామీణ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తా.
ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం హామీ.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ జిల్లెల ఆదిత్యరెడ్డి.
18వ డివిజన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ (బిగ్గు).
వరంగల్ పార్లమెంట్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య.