ముల్కనూర్‌లో వైభవంగా మహా చండీ హోమం.
శంభాజీ గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు.
Views: 95
On
భీమదేవరపల్లి, అక్టోబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ బస్టాండ్ వద్ద శంభాజీ గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో మహా చండీ హోమం వైభవంగా నిర్వహిస్తున్నారు. వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో పరిసర ప్రాంతం భక్తిశోభను సంతరించుకుంది.
లోకకల్యాణం, సకల జనుల శ్రేయస్సు, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలనే సంకల్పంతో మహా చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. చండీమాత అనుగ్రహంతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.
ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహా చండీ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Oct 2026 20:35:22
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్...


Comments