జమ్మికుంటలో జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం!
జమ్మికుంట, అక్టోబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వర్క్‌షాప్‌లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే వర్క్‌షాప్‌లోని ఫర్నిచర్‌తో పాటు బంగారు ఆభరణాలు కాలిపోయినట్లు సమాచారం. మంటలు వ్యాపిస్తున్న సమయంలో యజమాని, సిబ్బంది అప్రమత్తమై కొంత జ్యువెలరీ, ఫర్నిచర్‌ను బయటకు తీసుకురావడంతో మరింత నష్టం జరగకుండా కొంతమేర నివారించగలిగారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో జరిగిన మొత్తం ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత అధికారులు విచారణ చేపడితే ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments