శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అండగా   వారధి ఫౌండేషన్.

ఆలయానికి 25వేలు విరాళం ఇచ్చిన వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అండగా   వారధి ఫౌండేషన్.

ఖమ్మం బ్యూరో , అక్టోబర్ 20(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ఎఫ్సీఐ గోడౌన్ వద్ద ఉన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అండగా వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య విజయదశమి పర్వదినం రోజు  మంగళవారం 25వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. 
ఆలయ అభివృద్ధి కోసం ఈ 25వేల రూపాయల విరాళాన్ని అందించినట్లు వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గతంలో మున్నేరుకు వచ్చిన వరదల వలన ఆలయం ముంపుకు గురి కావడంతో ఆలయ మరమ్మత్తులకు  తమ సంస్థ అండగా నిలుస్తున్నదని తెలిపారు.    ఆలయంలో సకల పూజా కార్యక్రమాలు విఘాతం  లేకుండా జరగడానికి తమ వారధి ఫౌండేషన్ ద్వారా 25వేల రూపాయలను ఆలయ అర్చకులు మేడూరి రవికుమార్ కు అందజేశామని తెలిపారు. దైవ కార్యంలో తమ వారధి ఫౌండేషన్ తొలి కార్యక్రమంగా భాగస్వాములు అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. వారధి ఫౌండేషన్ మొదటి సేవా కార్యక్రమాన్ని కలియుగ దైవం  అఖిలాండ బ్రహ్మాండ కోటీ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దైవ సంకల్పంతో తాము నిర్వహిస్తున్న సేవా సంస్థ కార్యక్రమాలు  దిగ్విజయంగా జరగడానికి దీవెనలు అందించాలని ‌ స్వామివారికి మొక్కులు చెల్లించామని తెలిపారు.
ఇదేవిధంగా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య తో పాటు వారధి వారధి ఫౌండేషన్ సభ్యులు ఎం సాయి, చిక్కుళ్ల వెంకటేష్,పగిళ్లపల్లి రాజు,నాగరాజు,శివ, ఆలయ అర్చకులు మేడూరి రవికుమార్ , భక్తులు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పోలీస్ అమరవీరులకు నివాళ్లు . పోలీస్ అమరవీరులకు నివాళ్లు .
జఫర్గడ్ ,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు) పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో  ఎస్సై బి.వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,సెంటర్ లో పోలీస్...
హుస్సేన్ జాఫర్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు .
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అండగా   వారధి ఫౌండేషన్.
రావణుడి అంతంతో.. విజయదశమి సందడి!
మున్నూరుకాపు భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధుల విడుదలకు కలెక్టర్ అంగీకారం.
అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం.
జనసందోహం నడుమ దసరా వైభవం..