దుర్గాదేవి మండపాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.

దుర్గాదేవి మండపాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు.

కరీంనగర్, అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ నగరంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు దుర్గాదేవి మండపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

నగరంలోని అశోక్‌నగర్‌లో శ్రీ దుర్గా సేవా సమితి, టవర్ సర్కిల్‌లో ఫ్రెండ్స్ అసోసియేషన్, కమాన్ వద్ద కమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నగునూరులోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పోలీస్ అమరవీరులకు నివాళ్లు . పోలీస్ అమరవీరులకు నివాళ్లు .
జఫర్గడ్ ,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు) పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో  ఎస్సై బి.వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,సెంటర్ లో పోలీస్...
హుస్సేన్ జాఫర్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు .
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అండగా   వారధి ఫౌండేషన్.
రావణుడి అంతంతో.. విజయదశమి సందడి!
మున్నూరుకాపు భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధుల విడుదలకు కలెక్టర్ అంగీకారం.
అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం.
జనసందోహం నడుమ దసరా వైభవం..