జమ్మి ఆకును స్వీకరిద్దాం.. గంజాయి ఆకును తరిమికొడదాం!

విజయదశమి వేళ ముల్కనూర్ పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం.

జమ్మి ఆకును స్వీకరిద్దాం.. గంజాయి ఆకును తరిమికొడదాం!

భీమదేవరపల్లి, అక్టోబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముల్కనూరు ,భీమదేవరపల్లి గ్రామంల్లో సర్పంచ్లు జాలి ప్రమోద్ రెడ్డి,మాచర్ల కుమారస్వామి ఆధ్వర్యంలో ముల్కనూర్ ఎస్సై ఎం. రాజు నేతృత్వంలో పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయానికి ప్రతీకగా భావించే జమ్మి ఆకులను ఎన్వలప్‌లలో ఉంచి ప్రజలకు పంపిణీ చేస్తూ, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సందేశమిచ్చారు.

“జమ్మి ఆకును స్వీకరిద్దాం.. గంజాయి ఆకును తరిమికొడదాం!” అనే నినాదంతో యువత, ప్రజల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం, యువత భవిష్యత్తు పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మాచర్ల కుమారస్వామి అభినందించారు. ప్రజల మేలు కోరుతూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పోలీసు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

“సదా మీ మేలు కోరే మీ పోలీస్” అనే సందేశంతో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.IMG-20261021-WA0003

Tags:

Post Your Comments

Comments

Latest News

పోలీస్ అమరవీరులకు నివాళ్లు . పోలీస్ అమరవీరులకు నివాళ్లు .
జఫర్గడ్ ,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు) పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో  ఎస్సై బి.వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,సెంటర్ లో పోలీస్...
హుస్సేన్ జాఫర్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు .
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అండగా   వారధి ఫౌండేషన్.
రావణుడి అంతంతో.. విజయదశమి సందడి!
మున్నూరుకాపు భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధుల విడుదలకు కలెక్టర్ అంగీకారం.
అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం.
జనసందోహం నడుమ దసరా వైభవం..