హుస్సేన్ జాఫర్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు .

హుస్సేన్ జాఫర్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు .

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు )

చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన షేక్.మదార్  సాహెబ్ కుమారుడు షైక్ హుస్సేన్ జాఫర్ కి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు లభించింది. తొలి రౌండ్ లో కొత్తగూడెం మెడికల్ కాలేజీ లో, రెండవ రౌండ్ లో మహబూబ్ నగర్ ఎస్ వి ఎస్ కాలేజ్ లో, మా అప్ రౌండ్ లో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎస్ కె హుస్సేన్ జాఫర్ కి సీటు లభించింది. ఖమ్మం ప్రభుత్వ మైనార్టీ గురుకులం లో ఎస్ కె . హుస్సేన్ జాఫర్ 6నుండి ఇంటర్ వరకు విద్యను అభ్యసించాడు. అనంతరం నీట్ -2026లో 468 మార్కులతో  ఆలిండియా 16,793 ర్యాంక్ , రాష్ట్ర స్థాయిలో 2,407 ర్యాంక్ సాధించి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు సాధించాడు. హుస్సేన్ జాఫర్ తండ్రి మదార్  సాహెబ్ ఆటో వాలా కాగా, తల్లి  జరీనా ఖమ్మం డిపోలో ఆర్ టి సి కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా నాయకులు మంకెన  రమేష్   జాఫర్ హుస్సేన్ ఘనంగా శాలువాతో సన్మానించారు. తమ గ్రామ వాసి మదార్  సాహెబ్ కుమారుడు హుస్సేన్ జాఫర్ కి డాక్టర్ సీటు లభించడం పట్ల నేరడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో నేరడ మాజీ సర్పంచ్   మంకెన్ రమేష్ గ్రామ పెద్దలు ఆలస్యం నాగేశ్వరావు ఆలస్యం నరసింహారావు   చింతకాని పిఎస్సీ డైరెక్టర్ నన్న క కోటయ్య    గ్రామ పెద్దలు   కందిమల్ల  బాబు   చేవు ల  వెంకటప్రసాద్  కిలారి కిరణ్  మేడ అప్పలస్వామి  మాజీ సర్పంచ్  కిలారు ప్రకాష్ రావు కోట పెద్ద  బుచ్చాలు అల్లిక నరేష్  గోపి  కనకపుడి వెంకటేశ్వర్లు చిన్న పోగు కుటుంబరావు తదితరులు పాల్గొని  హర్షం తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పోలీస్ అమరవీరులకు నివాళ్లు . పోలీస్ అమరవీరులకు నివాళ్లు .
జఫర్గడ్ ,అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు) పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో  ఎస్సై బి.వినయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి,సెంటర్ లో పోలీస్...
హుస్సేన్ జాఫర్ ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు .
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అండగా   వారధి ఫౌండేషన్.
రావణుడి అంతంతో.. విజయదశమి సందడి!
మున్నూరుకాపు భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధుల విడుదలకు కలెక్టర్ అంగీకారం.
అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం.
జనసందోహం నడుమ దసరా వైభవం..