మున్నూరుకాపు భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధుల విడుదలకు కలెక్టర్ అంగీకారం.
ఆరు నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేయాలి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 21(తెలంగాణ ముచ్చట్లు )
మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణాన్ని వేగవంతం చేసి, ఆరు నెలల్లో పూర్తి చేయాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సూచించారు. భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి మంజూరైన రూ.50 లక్షలను వెంటనే విడుదల చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి నిధుల విడుదలకు అంగీకరించారు.
బుధవారం ఉదయం 11 గంటలకు మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షతన సంఘం ముఖ్యులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
పెండింగ్‌లో ఉన్న మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి నిధుల విడుదలపై ప్రత్యేకంగా చర్చించారు. నిర్మాణానికి అవసరమైన నిధులు సరిపోని పక్షంలో అదనపు నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నానని వద్దిరాజు రవిచంద్ర హామీ ఇచ్చారు. నిర్ణీత గడువులో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి సంఘ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ నెల 28న నూతన కార్యవర్గ సమావేశం
మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 28న మున్నూరుకాపు వసతి గృహంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో పాటు రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని సంఘం నాయకులు కోరారు.
నవంబర్ 15న వనసమారాధన
వచ్చే నెల నవంబర్ 15వ తేదీ ఆదివారం కార్తీక మాస వనసమారాధన నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ఖమ్మం నగరానికి సమీపంలోని కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఉన్న చెరుకూరి మామిడి తోటను సంఘం నాయకులు పరిశీలించి, కార్యక్రమ నిర్వహణకు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా గౌరవాధ్యక్షులు కొత్తా సీతారాములు, గౌరవ సలహాదారులు పొదిల రవికుమార్, పారా నాగేశ్వరరావు, మెంతుల శ్రీశైలం, పసుపులేటి నాసరయ్య, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, ప్రధాన కార్యదర్శి పసుపులేటి దేవేందర్, కోశాధికారి మడూరి పూర్ణ, ప్రముఖులు తాళ్లూరి హనుమంతరావు, జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు మాటేటి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాశం నాగేశ్వరరావు, ఖమ్మం నగర అధ్యక్షులు పారా ఉదయ్, నగర కోశాధికారి జి.వి.వి.ఎల్. నరసింహారావు, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు నానబాల హరీష్, నిర్వహణ కార్యదర్శి తిరుమలశెట్టి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Comments